మచిలీపట్నం సెప్టెంబర్ 12 ఆంధ్రపత్రిక .:
నగరంలో వివిధ ఆలయాలు మసీదులు, చర్చిలలో గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ముఖ్య మంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుండి త్వరగా బయట పడాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మచిలీపట్నం నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో,చర్చిల్లో, మసీదుల్లో జరిగిన సర్వమత ప్రార్ధనల్లో కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్య నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ 16 నెలలు జైలు భోజనం తిన్నారన్న సంగతి వైసీపీ నాయకులు గుర్తించుకోవల్లన్నారు. మా నాయకుడ్ని జైలు కి కూడా ఆయన సొంత వాహనాల్లో తరలించి, భోజనం కూడా తన సొంత పాంట్రీ నుంచి వచ్చేలా చేస్తున్నారని అది మా నాయకుడికి జగన్ కి ఉన్నా తేడా అని అన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎస్.వి.రంగారావు సినిమాలో చెప్పిన డైలాగు చెప్పారు. “జైల్లో ఉన్నా బయట ఉన్నా పులి పులే అని అన్నారు. చంద్రబాబు విషయంలో ఇది అక్షర సత్యం అన్నారు. ఆయన త్వరలోనే కడిగిన ఆణి ముత్యంలా బయటకి వస్తారన్న ఆశభావన్నీ వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ స్థాయి తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.