కె.కోటపాడు, ఫిబ్రవరి17(ఆంధ్రపత్రిక):
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా తెలుగుదేశంపార్టీ అభ్యర్థి డాక్టరు వేపాడ చిరంజీవిరావు విజయం సాధించండం చారిత్రాత్మక అవసరమని మాడుగుల టీడీపీ ఇంచార్జి పీవీజీ కుమార్ అన్నారు.శుక్రవారం ఇక్కడ ఆయన పార్టీ మాడుగుల పరిశీలకులు లొడగల కృష్ణతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీగా చిరంజీవిరావు గెలుపు రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయానికి సంకేతం కావాలన్నారు. పార్టీ పరిశీలకులు లొడగల కృష్ణ మాట్లాడుతూ ఆర్ధిక నిపుణుడు డాక్టరు చిరంజీవిరావుకు మాడుగుల నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీవచ్చేందుకుపార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు కశిరెడ్డి అప్పలనాయుడు, పాక్స్ మాజీ చైర్మన్ జూరెడ్డి రాము, ఎంపీటీసీ మాజీ సభ్యులు పూడి నారాయణమూర్తి, నాయకులు బత్తి వెంకటరమణ, గొల్లవిల్లి శ్రీరామ్మూర్తి, వి.ఎస్.నాయుడు, రొంగలి ఆప్పలనాయుడు, కన్నూరు సూర్యనారాయణ, పైలా నారాయణమూర్తి, గోపి, వాకాడ చిన్న, పల్లరాజుబాబు, రెడ్డి వెంకటప్రభాకరరావు తదితర్లు పాల్గొన్నారు.