- అర్థరాత్రి ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు
- పోలీసుల తీరుపై మండిపడ్డ భార్య పద్మవాతి
- అయ్యన్నకు ఏమైనా ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపణ
అయ్యన్న అరెస్ట్‌పై భగ్గుమన్న టిడిపి..నర్సీపట్నం బంద్‌కు పిలుపు
నర్సీపట్నం,నవంబర్ 3 (ఆంధ్రపత్రిక): మాజీమంత్రి,టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు సహా, ఆయన తనయుడిని అరెస్ట్ చేశారు. నర్సీపట్నంలో అర్థరాత్రి 2 గంటల సమయంలో అయ్యన్న నివాసానికి వెళ్లిన పోలీసులు.. ఆయనకే నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఇంటిగోడ కూల్చివేత విషయంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై అయ్యన్నపాత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయ్యన్న కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్న పాత్రుడు ఉండగా.. రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. ఏలూరు కోర్టులో వారిని ప్రవేశపెడుతామని చెప్పి తీసుకెళ్లారు. కానీ ఆయన్ను విశాఖ ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం ఏలూరు తీసుకెళ్తారా? లేక విశాఖలోనే కోర్టులో ప్రవేశపెడతారో పోలీసులు వెల్లడిరచలేదు. అయ్యన్నపాత్రుడి అరెస్టుపై ఆయన సతీమణి మండిపడ్డారు. అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేయడమేంటని నిలదీసారు. తాము ఎవరికేం అన్యాయం చేశామని ఇలా చేశారో అర్థంకావడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని చెప్పారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వలేదని.. 3 ఏళ్లుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. కొంతమంది పోలీసులు మద్యం సేవించి వచ్చారని.. అయ్యన్నకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అయ్యన్య అరెస్ట్‌తో నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో నర్సీపట్నంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి బండా రు సత్యనారాయణమూర్తితో పాటు పలువురు టీడీపీ నేతలు అయ్యన్న అరెస్ట్‌ను ఖండిరచారు. ఇరిగేషన్ కాలువపై ఇల్లు నిర్మాణం చేపట్టారని హైకోర్టుకు నకిలీ ధృవపత్రం సమర్పించారని ఆరోపణలపై సిఐడి పోలీసులు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడును తనయుడు 25 కౌన్సిలర్ రాజేష్‌ను అరెస్టు చేశారు. అయ్యన్నపాత్రుడును, తన యుడు రాజేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఏలూరు తరలించారు. దీంతో అయ్యన్నపాత్రుడు నివాసానికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. రావణాపల్లి ఇరిగేషన్ కాలవ ఆక్రమించి, ఇంటి గోడ కూల్చివేత సమ యంలో హైకోర్టుకు నకిలీ ధృపత్రం సమర్పించారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ముందస్తు సమాచారం లేకుండా తెల్లవారు జామున వారిని అరెస్ట్ చేయ డంపై అయ్యన్న సతీమణి పద్మావతి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయ్యన్నపాత్రుడుకు ప్రాణహాని ఉంద ని, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఆమె డిమాండ్ చేశారు. అయ్యన్న అరెస్టుకు నిరసనగా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు నర్సీపట్నం బంద్ ప్రకటించారు.