TDP: నారా లోకేష్‌కి తృటిలో తప్పిన పెను ప్రమాదం
జిల్లాలోని ఉరవకొండ (Uravakonda) నియోజకవర్గంలో టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) కి తృటిలోపెను ప్రమాదం తప్పింది.
అనంతపురం: జిల్లాలోని ఉరవకొండ (Uravakonda) నియోజకవర్గంలో టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) కి తృటిలోపెను ప్రమాదం తప్పింది. కూడేరు (Kuderu)లో క్రేన్ నుండి తెగి భారీ గజమాల లోకేష్‌పై పడింది. ఒక్క సారిగా జనాలు లాగడంతో భారీ గజమాల తెగిపడటంతో తృటిలో ప్రమాదం తప్పింది. దాంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైయింది. అయితే పోలీసు భద్రతా లోపాలపై టీడీపీ అధికారులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్‌ని పోలీసు (AP Police) భద్రతా లోపాలు వెంటాడుతూనే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా లోపం కారణంగా కదిరిలో లోకేష్ కుడి భుజానికి గాయమయింది. ఒక్కసారిగా జనాలు మీద పడటంతో రెండు వారాలుగా లోకేష్ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడేరులో మరోసారి భద్రతా లోపం కనిపించింది. ఒక్క సారిగా వేలాది మంది రావడంతో తోపులాట చోటుచేసుకుంది.