డిజిటలైజేషన్ రేసులో ఫోన్ పే, గూగుల్ పే ముందున్నాయి. వాటి తర్వాతి స్థానాల్లో పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ పే ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ పోటీగా మరో డిజిటల్ పేమెంట్ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా పే పేరుతో టాటా గ్రూప్ డిజిటలైజేషన్ రేసులో అడుగు పెట్టనుంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే టాటా గ్రూప్ సొంత డిజిటల్ పేమెంట్ యాప్ ను ప్రారంభిస్తుందని తెలుస్తోంది. టాటా గ్రూప్ దేశంలో స్వంత యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (ఙఖఎ) ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవను అందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి కోరుతున్నట్లు సమాచారం. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్స్ గా వ్యవహరించేందుకు టాటా గ్రూప్ ఏపిఎన్‌ఐసికి దరఖాస్తు చేసిందని ఆ నివేదిక చెబుతోంది. టాటా గ్రూప్ టాటా న్యూ పేరిట డిజిటల్ సేవలను వీలైనంత త్వరగా లేదా వచ్చే నెలలో ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.ఈసారి టాటా ఐపీఎల్ సీజన్ జరుగుతుండగా.. ఈ ఐపీఎల్ సెషన్స్ లోనే టాటా గ్రూప్ ఈ యాప్ ను లాంచ్ చేయాలని భావిస్తోందట. ఈ యాప్ బిగ్‌బాస్కెట్, 1ఎంజి, క్రోమా, టాటా క్లిక్ వంటి అన్ని టాటా డిజిటల్ యాప్‌లను అలాగే ఫ్లైట్ బుకింగ్ సేవలను ఒకే యాప్‌లో వినియోగదారులకు సులభంగా యాక్సెస్ చేస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టాటా న్యూ పేమెంట్స్ యాప్ అందుబాటులోకి వస్తే.. ఫోన్ పే, జీ పే లకు గట్టి పోటీ వచ్చినట్లేనని డిజిటల్ నిపుణుల అంచనా.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!