అమరావతి, మార్చి 25 (ఆంధ్రపత్రిక) : 20 23 `24కి సంబంధించిన విద్యుత్ టారిఫ్‌ను ఏపీ ఈఆర్సీ ఛైర్మన్, రిటైర్డ్ జస్టిస్ సీవి. నాగా ర్జునరెడ్డి విడుదల చేశారు. ఆర్థిక అవసరాలపై డిస్కంలు ఇచ్చిన టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజా భిప్రాయ సేకరణ చేపట్టి టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 3 డిస్కంలకు అందులో రైతులకు ఫ్రీ కరెంట్, ఎస్సీ, ఎస్టీల కు 200 యూనిట్లు వరకు ఇస్తున్న సబ్సిడీ.. ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు కలిపి ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే విద్యుత్ వల్ల 10,135 కోట్ల ఆదాయ లోటు వచ్చిందన్నారు. సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరిలో ఎవరిపై అదనపు ఛార్జ్‌లు ఉండబోవన్నారు రిటైర్డ్ జస్టిస్ నాగా ర్జునరెడ్డి. ఈ ఏడాది విద్యుత్ వినియోగ దారులు ఎటువంటి భారం మోపడంలేదన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్టీస్ర్ కంపెనీలకు ఇచ్చే హెచ్‌టీ వినియోగదారులకు మాత్రం కిలోవాట్‌కు 475 రూపాయల అదనపు డిమాండ్ ఛార్జ్‌ల ప్రతిపాదనను అంగీకరించా మన్నారు. వీటి టారిఫ్ దేశంలో మిగతా రాష్టాల్రతో పోలిస్తే ఏపీలో తక్కువేనన్నారు. మిగతా పెంపు ప్రతిపాదనలు తిరస్కరిం చామన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!