చితికి నిప్పంటించిన తండ్రి మోహనకృష్ణ
కన్నీటి పర్యంత అయిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్,ఫిబ్రవరి 20 (ఆంధ్రపత్రిక): నందమూరి తారకరత్న అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. ఫిలించాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. వైకుంఠ రథంలో చంద్రబాబు, బాలకృష్ణ, తారకరత్న కుటుంబసభ్యులు ఉన్నారు. తారక్, కల్యాణ్? రామ్, నారా లోకేశ్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. తారకరత్న పాడెను బాలకృష్ణ, నందమూరి కుటుంబీకులు మోశారు. తండ్రి మోహన కృష్ణ చేతుల విూదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. తారకత్నకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రజలు, అభిమానులు, టీడీపీ నేతలు భారీగా తరలివచ్చారు. బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 23 రోజుల తర్వాత తారకరత్న మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తారకరత్నకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్‌కృష్ణ చేతుల విూదుగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. తారకరత్న చితికి మోహనకృష్ణ నిప్పుపెట్టారు. చివరిసారి తారకరత్న నుదిటిపై తండ్రి మోహనకృష్ణ ముద్దుపెట్టి కన్నీరుమున్నీరయ్యారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని సహా, టీవీలలో చూసినవారిని కలచివేశాయి. కాగా తారకరత్న పాడెను చిన్నాన్న రామకృష్ణ , బాలకృష్ణ, ఇతర బంధువులు మోసి రుణం తీర్చుకున్నారు. భారమైన హృదయాలతో తారకరత్నను చంద్రబాబు, ఎంపీ విజయసాయి, బాలకృష్ణ, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, కుటుంబసభ్యులు, అభిమానులు సాగనంపారు. అంత్యక్రియల్లో నందమూరి కుటుంబసభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పాల్గొన్నారు. అంతకుముందు ఫిల్మ్‌ఛాంబర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానం వరకు కొనసాగింది. ఆయనను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, నందమూరు ఫ్యాన్స్ తరలివచ్చారు. వివాదరహితుడైన తారకరత్న అంటే అందరికీ అభిమానమే.. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో పాజిటివ్‌గా తీసుకునేవారట. అందుకే తారకరత్నను కడసారి చూసేందుకు భారీగా తరలి వచ్చారు. తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, కేంద్రమాజీమంత్రి పురందేశ్వరి సైతం అంతిమయాత్రలో పాల్గొన్నారు. తారకరత్నను ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ఇప్పటివరకు అన్నీబాలకృష్ణే దగ్గరుండి చూసుకున్నారు. అంత్యక్రియలు కూడా బాలకృష్ణ సూచనలతోనే నిర్వహించారు. మృత్యువుతో 23 రోజులుగా పోరాడిన నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూర్‌లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని బెంగళూర్ నుంచి రోడ్డు మార్గంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలోని తన నివాసానికి ఆదివారం ఉదయం తీసుకువచ్చారు. తారకరత్నను కడసారి చూసేందుకు బంధువులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, స్థానికులు పెద్దఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. దాంతో ఆయన నివాసం జన సంద్రమైంది..
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!