కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ నటించిన సార్ మూవీ తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. అసలైతే ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలోని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా భారీ స్థాయిలోనే తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ లో నాగ వంశీ నిర్మించారు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దేవ్ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్టర్ చేశాడు. ధనుష్ ఒక తెలుగు దర్శకుడి తో వర్క్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాతో ఎలాగైనా ధనుష్ తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒక అగ్ర హీరోను తీసుకురావడానికి చర్చలు జరుపుతున్నారు.ముఖ్యంగా మొదట అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది. గతంలో కూడా ధనుష్ చాలాసార్లు సోషల్ మీడియాలో తనకు తెలుగులో అభిమాన హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు అని ట్వీట్స్ కూడా చేశాడు. ఇక తప్పకుండా ధనుష్ కోసం పవన్ కళ్యాణ్ రావచ్చు అని అందులోను సీతార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీతో మంచి అనుబంధం ఉంది కాబట్టి పవన్ వస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. పవన్ కాస్త బిజీగా ఉండడంతో ఆ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ధనుష్ సినిమాలంటే కూడా చాలా ఇష్టమని మెగాస్టార్ గతంలో తెలియజేశారు. మరి ఇప్పుడు సార్ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి వస్తారో లేదో చూడాలి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!