తిరుమల,ఏప్రిల్27 : వీలైనంత వరకు జ్ఞానాన్ని సముపార్జించాలి. అది మనవరకే కాకుండా నలుగురితో పంచుకోవాలి. మన జ్ఞానం అందరికీ ఉపయోగ పడాలి. అప్పుడే మన ప్రతిభ ఇనుమడిస్తుంది. ఎందుకంటే మనం సాధించాలనుకొన్న కార్యంలో సన్నిహితులు మనకు సహాయం చేస్తారు. అప్పుడు మన సాధన సులువవుతుంది. నువ్వు ఈ కార్యం సాధించగలవు అంటూ హితులు, మిత్రులు, సహచరులు ధైర్యం చెబితేనే హనుమ సముద్రం దాటి లంకకు చేరి కార్యం సాధించుకొని వచ్చి ’చూశాను సీతను’ అనగలిగాడు. మనం ఏదైనా గొప్ప కార్యాన్ని తలపెట్టి పూర్తి చేయాలనుకొంటే మనకో మంచి స్నేహితుడు ఉండాలి. అతడు విమర్శకుడు, మార్గదర్శకుడైతే ఎన్నో మంచి మాటలను ఉపదేశిస్తాడు. అప్పుడు మనం అనుకొన్న సాధన సఫలమై తీరుతుంది. మనందరిలో ప్రత్యేకత ఉంది. కానీ, దాన్ని కనిపెట్టే తీరిక ఓపిక ఉంటే ఏది సాధించడంలోనైనా మనలో ప్రాజ్ఞత వికసిస్తుంది. సూర్యవంశానికి చెందిన భగీరథుడు సగరుడి వారసులకు ఉత్తమ గతులను కలగజేసేందుకు దివిజ గంగను భువికి తెచ్చే మహా ప్రయత్నం చేశాడు. ఈ సాధననే భగీరథ సాధన అన్నారు. ప్రతి మనిషీ అద్భుతంగా జీవించాలని ఆదిశంకరాచార్యులు తరచూ అనేవారట.
అలా బతికితే ప్రతి రోజూ సాధనకు మనసు ఉరకలు వేస్తుంది. రాబోయే రోజులన్నీ ఆశాజ్యోతులవుతాయి. ఆదిశంకరులు దేశాన్ని మొత్తం కాలినడకన పర్యటించి తాను తలపెట్టినట్లు నాలుగు పీఠాలను నెలకొల్పగలిగారు. పాశ్చాత్య పురాణాల్లోని
నాయకులు కండబలం కలవారు. మన భారతీయ ఇతిహాసాల్లో ధీరులు నైతికంగా ధార్మికంగా బలవంతులు. కండబలం కంటే గుండెబలం మనోబలం శక్తిమంతమైనవి. ఇలాంటి సాధకులే రామాయణ మహాభారత వీర గాథలకు కారకులు.
““`
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!