డీజీపీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఫిర్యాదు
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తన పాదయాత్రలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డీజీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎల్.రమణ, శంభీపూర్ రాజు, తక్కెళ్లపల్లి రవీందర్, తాతా మధు, దండె విఠల్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
రేవంత్‌రెడ్డి మంగళవారం తన పాదయాత్రలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయాన్ని నక్సలైట్లు గ్రెనేడ్స్ పెట్టి పేల్చాలని కోరడం, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేయడాన్ని వారు ప్రస్తావించారు. చట్ట సభల్లో సభ్యుడిగా ఉండి అధికారిక భవనాలు కూల్చేయాలని కోరడం అంటే అది కచి్చతంగా అది చట్టవ్యతిరేకమైన చర్యగా భావించాలని వారు కోరారు. రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు
ములుగు: ములుగులో జరిగిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను నక్సలైట్లు కూలి్చవేసినా తప్పులేదంటూ చేసిన వ్యాఖ్యలు నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉన్నాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కలపై కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ములుగు ఎమ్మెల్యే మాజీ నక్సలైట్ కావడం నక్సలైట్లతో మధ్యవర్తిత్వం నడిపినట్లు అనుమానాలున్నాయని ఆ ఫిర్యాదులో తెలిపారు. సదరు వ్యక్తులపై కుట్ర కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ కోరారు. ఆయన వెంట ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్‌రాంనాయక్, కోగిల మహేశ్ ఉన్నారు.