సెట్స్‌పై ఫోటోలు అప్లోడ్ చేయవద్దన్న నిర్మాతలు
సెప్టెంబర్ 26 (ఆంధ్రపత్రిక): దర్శకుడు సిరుత్తై శివ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే.. సినిమా సెట్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో వాటిని చట్టవిరుద్ధంగా అప్లోడ్ చేసి, షేర్ చేస్తున్న వారిని అలా చేయవద్దని నిర్మాతలు కోరారు. ఇలాగే చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్‌లు సోషల్ విూడియాలో షేర్ చేసి ఓ ప్రకటనలో.. ’అందరికీ వినయపూర్వకమైన అభ్యర్థన. మా రాబోయే ప్రొడక్షన్ సూర్య 42 షూటింగ్ సెట్ల నుంచి కొంతమంది వీడియోలు, ఫొటోలను సోషల్ విూడియాలో షేర్ చేయడం మేము గమనించాం.
సినిమాలో వచ్చే ప్రతి సీన్ కోసం రక్తాన్ని చెమటగా మార్చి మా బృందం కష్టపడుతోంది. మేము ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరికీ గొప్ప థియేట్రికల్ అనుభవంగా అందించాలనుకుంటున్నాం. విూరు షేర్ చేసిన వీడియోలు, చిత్రాలను నెట్లో నుంచి తీసివేస్తే.. మాకు పెద్ద సహాయం చేసినవారు అవుతారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి చేయొద్దని అభ్యర్థిస్తున్నాం. ఈ విధాన్ని కొనసాగిస్తూ ఇలాగే వీడియోలు, ఫొటోలు షేర్ చేసేవారిపై చట్టపరంగా కాపీరైట్స్ కింద లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం’ అని రాసుకొచ్చారు. సూర్య 42’ త్రీడీలో తెరకెక్కించడంతోపాటు దాదాపు 10 భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ఎª`లాన్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ని అందుకుని సినిమాపై అంచనాలను పెంచింది. కాగా.. ఈ మూవీలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు