నేరాలకు పాల్పడ్డ నిందుతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాధారణంగా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ మీడియా సమావేశాలపై పోలీసులు పాటించాల్సిన నిబంధనలపై సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. నింబంధల ప్రకారమే.. క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తెలింది. క్రిమినల్స్‌పై చేసే విచారణలు పూర్తికాకముందే.. వెల్లడించేటటువంటి అసమగ్ర విషయలు మీడియా విచారణకు అవకాశాలు కల్పిస్తాయని చెప్పింది.
నేరాలకు పాల్పడ్డ నిందుతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాధారణంగా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ మీడియా సమావేశాలపై పోలీసులు పాటించాల్సిన నిబంధనలపై సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. నింబంధల ప్రకారమే.. క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తెలింది. క్రిమినల్స్‌పై చేసే విచారణలు పూర్తికాకముందే.. వెల్లడించేటటువంటి అసమగ్ర విషయలు మీడియా విచారణకు అవకాశాలు కల్పిస్తాయని చెప్పింది. అయితే ఇందులో న్యాయ ప్రక్రియను దారి మళ్లించే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది. అంతేకాదు న్యాయమూర్తుల పనితీరుపైన తీవ్రమైన ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఇక నిందితులు, బాధితులు, సాక్షుల హక్కులను భంగం కలిగించేప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొంది. అందుకోసమే క్రిమినల్ కేసులు వెల్లడించే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
నేరస్తులకు సంబంధించిన వివరాలను మీడియాకు చెప్పే సమయంలో పాటించాల్సిన ప్రామాణిక నిబంధనలను పాటించాలని సూచనలు చేసింది. అయితే ఇందుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను.. మూడు నెలల్లోగా రూపొందించాలని కేంద్ర హోం శాఖకు సుప్రీంకోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని రూపకల్పనపై అన్ని రాష్ట్రాల డీజీపీలు నెల రోజల్లోపు సూచనలు చేయాలని తెలిపంది. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని సూచనలు చేసింది. ఇదిలా ఉండాగా.. 2010లోనే హోంశాఖ మార్గదర్శకాలు వెలువడినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే ఆ కాలానికి, ప్రస్తుత కాలనికి అనేక మార్పులు వచ్చాయని తెలిపింది.
అంతేకాదు ముఖ్యంగా పత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో నేర వార్తల కవరేజిలో ఎంతగానో మార్పులు వచ్చాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అలాగే పక్షపాతంతో కూడినటువంటి రిపోర్టింగ్ చేయడం వల్ల నేర నిర్ధరణ చేయకముందే.. నిందితుడే దోషీ అన్న అభిప్రాయం కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇక క్రిమినల్ కేసుల దర్యాప్తు విషయంలో పోలీసులు అనుసరిస్తున్న విధివిధానాలకు సంబంధించి దాఖలైనటువంటి పటిషన్‌పై.. విచారణ సందర్భంగా బుధవారం రోజున ధర్మాసం ఇలా వ్యాఖ్యనించింది. అయితే నేరస్తులను మీడియా ముందుకు తీసుకొచ్చినప్పుడు.. పోలీసులు వెల్లడించే వివరాలు.. పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్టంగా ఉండాలని.. బాధితుల వయసు, జెండర్‌తో పాటు నిందితులు, సాక్ష్యుల గొప్యతను కచ్చితంగాపరిగణలోకి తీసుకోవాలి సూచనలు చేసింది. అలాగే మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్క, వాక్స్వాతంత్య్రం, సమాచార వ్యాప్తి, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశాలు ఇవ్వడం లాంటి విషయాలపై కూడా దృష్టి సారించాలని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణనను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.