బిజెపి పాలిత రాష్టాల్ల్రో అమలు చేయాలి
అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి వెల్లడి
హైదరాబాద్,ఫిబ్రవరి10(ఆంధ్రపత్రిక) :తెలంగాణలో అర్హులైన లబ్దిదారులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి, గ్రావిూణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడిరచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడిరచారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గువ్వల బాలరాజు, పద్మాదేవేందర్ రెడ్డి, జాజుల సురేందర్, జాఫర్ హుస్సేన్, దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సాప్ట్ వేర్ సమస్యల వల్ల పెన్షన్లకు ఇబ్బంది వస్తున్న చోట సమస్యను పరిష్కారిస్తుమని పేర్కొన్నారు. ఎక్కడా కూడా ట్రాక్టర్, కారు చూసి పెన్షన్లు ఆపడం లేదని, వారి ఆర్థిక పరిస్థితిని బట్టే పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. దివ్యాం గులకు నెలనెలా మరిన్ని సదరం క్యాంపులు పెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 9,08,498 మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 861 కోట్లు ఇవ్వగా ప్రస్తుతం తెలంగాణలో రూ. 12వేల కోట్ల ను బ్జడెట్లో కేటాయించామన్నారు. బీజేపీ పాలిత రాష్టాల్లో గ్రామంలో వెయ్యి మంది ఉంటే 60, 70 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయని వెల్లడిరచారు. తెలంగాణలో వెయ్యి మందికి గ్రామంలో ఆరు వందల నుంచి ఏడువందల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అధికారంలోకి వస్తే రూ. మూడు వేలు ఇస్తామని బీజేపీ నాయకులు మాయమాటలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్టాల్లో రూ. మూడు వేలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మణిపూర్లో రూ. 200 నుంచి రూ. 500 , అస్సాంలో రూ. 250 నుంచి రూ. 550 , నాగాలాండ్ లో రూ. 200, మిజోరాంలో రూ. 300 మాత్రమే ఇస్తున్నారన్నారు. గొప్పలు చెప్పుకునే ఉత్తర ప్రదేశ్ లో పెన్షన్ రూ . వెయ్యి , మోడీ, అమిత్ షా సొంత రాష్టాలైన్ర గుజరాత్ లో వెయ్యి నుంచి రూ. 1,250 వరకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు కావడంతోపెన్షన్ పొందే భార్యాభర్తలలో ఒకరు చనిపోతే వెంటనే మిగిలిన వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రభుత్వానికి. సంబంధిత మంత్రికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!