అక్టోబర్ 31 (ఆంధ్రపత్రిక): టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం కమర్షియల్ హిట్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయన సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తున్నా బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలి పోతున్నాయి. ఇటీవలే ఈయన నటించిన ఆ అమ్మాయి గురించి విూకు చెప్పాలి సినిమా కూడా రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్‌గా మిగిలింది. ఫలితం ఎలా ఉన్నా సుధీర్‌బాబు మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో నాలుగు సినిమాలు న్నాయి. ఇటీవలే ఈ యంగ్ హీరో తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. 1989 నేపథ్యంలో చిత్తూరులోని కుప్పంలో ఈ కథ జరుగనుంది. డివైన్ టచ్‌తో సాగే పీరియాడిక్ చిత్రమని తెలుస్తుంది. ఈ చిత్రానికి సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు. టైటిల్ వీడియోతోనే సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాకు హరోంహర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యెశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!