బ్రిటిష్ చట్టాలకు పాతర
ఐపిసి,సిసిపిలను మార్చేలా చట్టాలకు పదును
భారతీయ నాగరిక్ సురక్షా సంహితగా ఐపిసి
అత్యాచార కేసుల్లో కఠిన శిక్షలకు ప్రతిపాదన
లోక్‌సభలో ప్రవేశ పెట్టిన కేంద్రహోంమంత్రి అమిత్ షా
పార్లమెంటరీ కమిటీకి కొత్త చట్టాలు
న్యూఢల్లీి,ఆగస్ట్ 11 : ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలనానికి తెరదీసింది. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ చట్టాలైన ఐపీసీ, సీసీపీ, ఐఈఏ స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఐపీసీ స్థానంలో ’భారతీయ న్యాయ సంహిత’ కొత్త చట్టాన్ని తీసుకోరాబోతోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన మూడు బిల్లులను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేసి కొత్తవాటిని ప్రవేశపెట్టడమే లక్ష్యమని ఈ సందర్భంగా లోక్‌సభలో అమిత్ షా వ్యాఖ్యానించారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో ’భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ’భారతీయ సాక్ష్య’ చట్టాలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఇక శాంతి భంగం కలిగించే నేరాలు, సాయుధ తిరుగుబాటులు, విధ్వంసకర చర్యలు, విజభనవాద కార్యకలాపాలు లేదా భారత ఐక్యత, సమగ్రతకు సంబంధించిన చట్టాలను సవరించిన చట్టాలలో చేర్చనున్నారు. మరోవైపు మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలను కొత్త బిల్లుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక తొలిసారిగా చిన్నచిన్న నేరాలకు సంఘసేవను శిక్ష విధించ బోతున్నారు. అంతేకాదు.. లింగసమానత్వంతో కొత్తచట్టాలను రూపొందించారు. ఇక వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదానికి సంబంధించిన కొత్త కార్యకలాపాలను నియంత్రించేలా కఠినమైన శిక్షలను చేర్చారు. అంతేకాదు.. వేర్వేరు నేరాలకు సంబంధించిన జరిమానాలు, శిక్షలను పెంచారు. కాగా ఇండియన్ పీనల్ కోడ్‌ను 1860లో ప్రవేశపెట్టారు. మూడు బిల్లుల్లోని ముఖ్యమైన మార్పులు ఇలా ఉన్నాయి. మైనర్లను అత్యాచారం చేస్తే ఉరిశిక్ష, సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు, మూక దాడులకు ఏడేళ్ల జైలు, 7 సంవత్సరాలకుపైగా శిక్ష విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాలు తప్పనిసరి చేశారు. ఎక్కడి నుంచైనా ఈ`ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. సెర్చ్ ఆపరేషన్ చేస్తే సెర్చ్ వారెంట్‌తోపాటు ఎవరి వద్దకైనా వెళ్తే వీడియోగ్రఫీ చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు అన్ని డిజిటైలైజ్ చేయాలి. ఈ క్రమంలోనే నిర్ణయాలు తీసుకున్నట్లు అమిత్ షా ప్రకటించారు. త్వరలోనే దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయ నున్నట్టు లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఓ ప్రతిపాదన చేసినట్టు వెల్లడిరచారు. ఎన్నో దశా బ్దాలుగా ఈ చట్టం వివాదాస్పదమవుతోంది. కుట్రపూరితంగా కావాలనే కొందరిపై ఈ చట్టం పేరుతో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్న విమర్శలు, ఆరోపణలూ ఉన్నాయి. రద్దు చేయాలని ప్రతిపక్షాలు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. మాజీ సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ కూడా దీనిపై వివరణ ఇవ్వాలని గతంలోనే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అమిత్ షా చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఇండియన్ పీనల్ కోడ్ఇకపై ఇండియన్ జస్టిస్ కోడ్‌గా మారుతుందనీ ప్రకటించారు. భారతీయ న్యాయ సన్హిత బిల్లో భాగంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో కీలక మార్పులు చేయనున్నట్టు వెల్లడిరచారు. భారతీయ న్యాయ సన్హిత బిల్, భారతీయ నాగరిక్ సురక్ష సన్హిత, భారతీయ సాక్ష్య బిల్స్‌ని ప్రవేశపెట్టే సమయంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 1860 నుంచి ఇప్పటి వరకూ దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బ్రిటీష్ చట్టాలకు అనుగుణం గానే పని చేస్తోంది. అందులోని మూడు బిల్స్ స్థానంలో కొత్త బిల్స్‌ని ప్రవేశ పెడుతున్నాం. అంతే కాకుండా…న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణలూ చేయనున్నాం. ఇందులో భాగంగానే దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేస్తాం. ఈ కొత్త చట్టాలతో 90శాతం పైగా నేరగాళ్లకు కచ్చితంగా శిక్షలు పడేలా ప్రొవిజన్స్ చేర్చాం. ఏడేళ్లకు పైగా జైలు శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్ టీమ్ క్రైమ్ సీన్‌ని పరిశీలించడాన్ని తప్పనిసరి చేస్తున్నాం.’అని అమిత్ షా ప్రకటించారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మార్చడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమనిల్ ప్రొసీజర్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలకు బదులుగా ఈ కొత్త బిల్స్‌ని ప్రవేశపెట్టినట్టు వెల్లడిరచారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం…2014`20 మధ్య కాలంలో దాదాపు 399 దేశ ద్రోహ చట్టాలు నమోదయ్యాయి. అయితే…వీటిలో 8 కేసుల్లో మాత్రమే శిక్ష పడిరది. 2014తో పోల్చుకుంటే 2020 నాటికి దేశ ద్రోహ కేసులు 55శాతం మేర పెరిగాయి. గతేడాది సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. దేశ ద్రోహం కేసుల విచారణను సస్పెండ్ చేసింది. ఈ చట్టాన్ని రివ్యూ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దుర్వినియోగం అవకుండా చూడాలని తేల్చి చెప్పింది. శాంతి భద్రతలను కాపాడుతూనే…భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యాలెన్స్డ్గా వ్యవహరించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్రం ఈ ప్రకటన చేసింది.