కె.కోటపాడు, ఫిబ్రవరి 09:
ఈనెల11వ తేదీన ప్రకాశంజిల్లా ఒంగోలులో నిర్వహించనున్న ఎస్సీ,ఎస్టీగజిటెడ్ అధికారులు, ఉద్యోగుల రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఎస్సీ, ఎస్టీ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక సబ్-రిజిస్ట్రార్ బంగారి వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఒంగోలు కలెక్టర్ ఆఫీసు ఎదురుగా అంబేద్కర్ భవన్ లో శనివారం ఉదయం 10గంటలకు ప్రకాశం జిల్లా ఎస్సీ,ఎస్టీ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరనుందని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ అన్ని క్యాడర్ల ఉద్యోగులు రాష్ట్ర సదస్సుకు హాజరవ్వాలని అయన కోరారు. రెగ్యులర్, టీచింగ్, నాన్-టీచింగ్, కాంట్రాక్ట్, మినిమం టైంస్కేల్, పార్ట్ టైం, గెస్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సదస్సులో పాల్గొని సమస్యలను చర్చించినట్లయితే ఉన్నతాధికారుల ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషించబడతాయని ఎస్సీ,ఎస్టీ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు.