* పశుసంవర్ధక శాఖలో రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రదానోత్సవం..
* విపత్తు నుండి పశువులకు పునరావాసం కల్పించినందుకు మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో అవార్డుల ప్రధానం..
* పురస్కారంతో పాటుగా రూ. 10 వేల రూపాయల నగదు రివార్డు అందించాం..
* మొత్తం 62 మంది పశుసంవర్ధక ఉద్యోగులకు అవార్డుల ప్రధానం..
* పురస్కారాలు పొందిన ఉద్యోగులను అభినందించిన పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు..
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన గోదావరి వరదలలో, గత నవంబర్ లో నెల్లూరు, చిత్తూర్ లలో సంభవించిన తుఫాన్ సమయాలలో వేల సంఖ్యలో పశువులను విపత్తు నుండి రక్షించి పునరావాసం కల్పించినందులకు గాను 62 మంది పశుసంవర్ధక ఉద్యోగులకు నగదుతో కూడిన పురస్కారాలను అందించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి శ్రీ సీదిరి అప్పలరాజు చెప్పారు.
మంగళవారం ఏపీఐఐసీ కార్యాలయంలో నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ సీదిరి అప్పలరాజుతో పాటుగా పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. పూనం మాలకొండయ్య, మత్స్య శాఖ కమిషనర్ శ్రీ కె. కన్నబాబు, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. ఆర్. అమరేంద్ర కుమార్ లు, కార్యాలయ సిబ్బంది పాల్గొని సన్మాన గ్రహీతలను అభినందించారు.
గౌరవ మంత్రివర్యులు శ్రీ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించి విపత్తు నుండి పశువులను కాపాడిన ఉద్యోగులకు అవార్డులతో పాటు రూ. 10 వేల రూపాయల నగదును రివార్డుగా అందించామని తెలిపారు. ఒక దేశం యొక్క గొప్పతనం నైతిక పురోగతిని ఆదేశంలో పశువులతో వ్యవహరించే విధానం ద్వారా అంచనా వేయవచ్చునని మహాత్మా గాంధి చెప్పిన సూక్తిలో ఉన్న గొప్పతనాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసారు.
కార్యక్రమంలో పశువులను విపత్తు నుండి రక్షించి పునరావాసం కల్పించినందులకు గాను ఉత్తమ సేవలు అందించినందుకు 12 మంది మత్స్య కారులకు, ఇద్దరు జంతు ప్రేమికులకు, ఇద్దరు సంయుక్త సంచాలకులకు, 10 మంది జిల్లా పశుసంవర్ధక అధికారులకు, 7 మంది ఉపసంచాలకులకు, ఒక కార్యాలయ పర్యవేక్షకులకు, 5 మంది సహాయ సంచాలకులకు, 11 మంది పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులకు, 6 మంది పారా వెటర్నరీ సిబ్బంది, 6 పశుసంవర్ధక సహాయకులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలను, నగదు పురస్కారాలను రాష్ట్ర మంత్రి శ్రీ సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా అందించడం జరిగింది.
ప్రత్యేక కార్యదర్శి డా. పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల సమయంలో సన్మానితులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పశువులను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడి, సన్మానితులను అభినందించారు.
పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. ఆర్. అమరేంద్రకుమార్ సన్మానితులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారియొక్క పనితనాన్ని కొనియాడుతూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద స్థాయిలో పురస్కారాల ప్రధానం ఇదే మొదటిసారి అని గుర్తు చేసారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!