కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మమకొండలో ఏర్పాటు చేసిన భాజపా భారీ బహిరంగ సభలో తెరాస ప్రభుత్వంపై నడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరంగల్ ప్రజలకు నమస్కారాలు అంటూ జేపీ నడ్డా ప్రసంగం మొదలు పెట్టారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ముగింపు సభను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుట్రలు చేసిందన్నారు. కానీ, హైకోర్టు అనుమతితో సభ ఏర్పాటు చేశామని చెప్పారు. తాను హైదరాబాద్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజలు సభకు రాకుండా అడ్డుకునే కుట్రలు చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అంధకారంలో ఉందని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. కేసీఆర్ అవినీతి ఢల్లీి వరకు కూడా పాకిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందన్నారు. రూ.40వేల కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలు పెట్టిన కేసీఆర్ సర్కారు.. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.లక్ష 40 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాను న్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నయా నిజాం అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. కేసీఆర్ కూడా విూర్ ఉస్మాన్ ఆలీఖాన్ బాటలో నడుస్తున్నారని చురకలంటించారు. నిజాం తరహాలోనే ప్రజలు కేసీఆర్‌ను రాబోయే రోజుల్లో ఇంట్లో కూర్చోబెడుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ఇదే ముగింపు అని చెప్పారు. ప్రజలు కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో వరదలు వస్తే కేంద్రం రూ.377 కోట్లు ఇస్తే..ఆ నిధులను సీఎం కేసీఆర్ ప్రజలకు ఇవ్వలేదని జేపీ నడ్డా అన్నారు. జల్ జీవన్ స్కీం కింద కేంద్రం రూ.3,098 కోట్లు ప్రకటించిందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లే తీసుకుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కారు చాలా రకాలుగా నిధులు కేటాయించినా..వాటిని కేసీఆర్ డైవర్ట్ చేసి..కేంద్రంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల్లో వెలుగులు నింపేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేశారని జేపీ నడ్డా తెలిపారు. మూడు విడతల్లో బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన పాదయాత్రలో బండి సంజయ్ టీఆర్ఎస్, కేసీఆర్.. తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపారని చెప్పారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించటం లేదు. అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలైంది. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాల్సిన సమయం ఇదేనని జేపీ నడ్డా అన్నారు. ఓరుగల్లులో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిస్తామని జైలును కూల్చారని జేపీ నడ్డా అగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్‌లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మించలేదని మండిపడ్డారు. అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలైందని ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాల్సిన సమయం వచ్చిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. సభలో పాల్గొనేందుకు వరంగల్ చేరుకున్న జేపీ నడ్డా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, తరుణ్ చుగ్‌తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు, అధికారులు జేపీ నడ్డాకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జేపీ నడ్డా వెంట తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి కూడా ఉన్నారు. భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ ఇంటికి జేపీ నడ్డాతో పాటు బండి సంజయ్, రాష్ట్ర నాయకులు వెళ్లారు. అక్కడ చాయ్ తాగి, రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత నేరుగా హన్మకొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు వెళ్లారు. బండి సంజయ్ నిర్వహించిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వరంగల్‌లో ముగిసింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!