- తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ…
- రెండు రోజుల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
తిరుపతి జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రపత్రిక): రెండు రోజులు తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మూడు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
అక్కడ నుండి రోడ్డు మార్గాన తిరుపతిలో చిన్న పిల్లల గుండె జబ్బులు వైద్యం కోసం అధునాతన వసతులతో నూతనంగా ఏర్పాటు చేసిన “బర్డ్” ఆసుపత్రి ని ప్రారంభిస్తారు.
తరువాత అలిపిరి దగ్గర నూతనంగా గోవుల కోసం నిర్మించిన గోమందిరాన్ని ప్రారంభిస్తారు.
తర్వాత భక్తులు కాలినడకన తిరుమల చేరుకునే అలిపిరి మెట్ల మార్గంలో నూతనంగా దాతల సాయంతో నిర్మించిన పైకప్పు,అభివృద్ధి చేసిన మెట్ల మార్గాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.
తర్వాత మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు.
తరువాత ప్రభుత్వం తరఫున సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్ లో సేద తీరుతారు..మరుసటి రోజు వేకువజామునే 5.30 కి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు..
శ్రీవారి సన్నిధి సమీపంలో నూతనంగా నిర్మించిన బూందీ లడ్డు పోటుని ప్రారంభిస్తారు…
తర్వాత గొల్ల మండపాన్ని దర్శించుకుంటారు ..శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు కన్నడ ,హిందీ భాషలలో ప్రవేశ పెట్టనున్న నూతన ప్రసారాలను ప్రారంభిస్తారు.
తరువాత తిరుమలలోని అన్నమయ్య భవన్లో రైతు సాధికారిక సంస్థ టీటీడీ మధ్య జరిగే ఒప్పంద కార్యక్రమంలో ముఖ్య మంత్రి పాల్గొంటారు.
కార్యక్రమాలు పూర్తయ్యాక సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల నుండి రేణిగుంట చేరుకుని అక్కడి నుండి నంద్యాల పర్యటనకు వెళతారు.