జనవరి 12 న ఉదయం ఎనిమిదిన్నర గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అంకురార్పణ, అగని ప్రతిష్ఠాపన, ద్వజారోహణ కార్యక్రమంతో సకలదేవతలకు ఆహ్వానం పలుకుతూ ద్వజకేతనం ఆవిష్కరిస్తారు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18 తో ముగుస్తాయి. ఈ ఏడు రోజులూ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహన సేవలు నిర్వహిస్తారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మకరసంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు 7 రోజులపాటు జరగనున్నాయి. జనవరి 12 న ఉదయం ఎనిమిదిన్నర గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అంకురార్పణ, అగని ప్రతిష్ఠాపన, ద్వజారోహణ కార్యక్రమంతో సకలదేవతలకు ఆహ్వానం పలుకుతూ ద్వజకేతనం ఆవిష్కరిస్తారు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18 తో ముగుస్తాయి. ఈ ఏడు రోజులూ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహన సేవలు నిర్వహిస్తారు. జనవరి 14న చిన్నారులకు భోగిపళ్లు కార్యక్రమం నిర్వహిస్తారు.15న మహిళలకు ముగ్గులు పోటీలు, మకర సంక్రాంతి రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు కారణంగా ప్రతిరోజూ నిర్వహించే రుద్ర, చండి హోమం, స్వామి అమ్మవార్ల కళ్యానం, ఏకాంతసేవలను నిలిపివేసినట్టు ఈవో పెద్దిరాజు తెలిపారు.