పథక పనులులో లోటుపాట్లు
వరంగల్,ఫిబ్రవరి21 : గ్రావిూణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హావిూ పథకం కూలీలకు ఉపాధినివ్వడం లేదు. గ్రామాల్లో పనులను చూసి కూలీలకు పని దినాలు కల్పించాల్సి ఉండగా, సరైన ఉద్యోగులు లేక పథకం జిల్లాల్లో నీరుగారి పోయే ప్రమాదం ఏర్పడిరది. జిల్లాలో సరిపడే ఫీల్డ్ అ సిస్టెంట్లతో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు లేకపోవడంతో పాటు
పనులను చూసి ఎస్టిమేట్ వేసే ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ పోస్టులు ఖాళీగా ఉండటంతో జిల్లాలో ఉపాధి హావిూ
పథకం కొంత కుంటుపడే ప్రమాదం ఏర్పడిరది. గ్రావిూణ ప్రాంతాల్లో ని వ్యవసా యంపై ఆధారపడిన కూలీలతో పాటు వ్యవ సాయేతర కూలీలకు పని కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. జగిత్యాల జిల్లాలో ఫాంపాండ్, వర్మీ నాడెపు కంపోస్టు ఫిట్‌లు, మ్యాజిక్ సోక్ పిట్స్, డంపింగ్ యార్డులు, కిచెన్ షెడ్లు, స్కూల్ టాయిలెట్లు, శ్మశాన వాటికలు, సాయిల్డ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపోస్టు షెడ్లు కూడా ఉపాధి హావిూ కూలీలతోనే చేయిస్తూ ఉన్నారు. ఇందులో ప్రభుత్వం కొంత డబ్బును అందిస్తుండగా, మరికొంత మొత్తాన్ని వస్తు రూపంలో అందిస్తూ వస్తుంది. అయితే జిల్లాలో కొంత కాలంగా పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలా పోస్టులు ఖాళీగా ఉండగా, కొందరు పని చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. జిల్లాలో ఉపాధి హావిూ పథకం మొన్నటి వరకు బాగానే నడిచినా ఇప్పుడు పర్యవేక్షణ లేకపోవడంతో కొంత నత్తనడకన నడుస్తుందనే ఆరోపణలు విని పిస్తున్నాయి. అయితే తక్కువ వేతనం ఉండటంతోనే ఫీల్డ్ అసిస్టెంట్‌గా చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీని కితోడు ఇంతవరకు ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేసినవారు కూడా రాజీనామా చేసి ఇతర పనులు చేసుకుంటున్నారు. దీనికితోడు ఉపాధి హావిూ పథకంలో గ్రామాల్లో ప్రజాప్రతినిధుల నుంచి ఫీ ల్డ్ అసిస్టెంట్లు ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. దీంతో ఎవరు పని చేసేందుకు ముందుకు రావడం లేదు. పనుల్లో నాణ్యత లోపించినా, ఇతర టెక్నికల్ సమస్యల్లో వీరు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో చాలా మంది ముందుకు రావడం లేదు. పభుత్వం ఇటీవలే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధి కూలీలకు అలవెన్సులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వాసులు చేతుల మీదుగా మహాశివరాత్రి స్పెషల్ సంచిక ఆవిష్కరణ.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!