శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. పొలాలకు వెళ్లే రైతులకు, జీడి తోటల్లో పనులు చేసుకునే కూలీలకు రోజు ఎక్కడో చోట ఎలుగుబంట్లు తారస పడుతూ ఉంటాయి. పొరపాటున దగ్గరగా ఎదురుపడితే ఎలుగుబంట్లు మనుషులపై దాడులు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఎలుగుబంట్ల దాడుల్లో గతంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే జిల్లాలోని మందస మండలం పెద్ద లోహరిబందలో ఓ ఎలుగుబంటి వింతగా ప్రవర్తిస్తుంది. గ్రామ శివారులోని మెట్టవద్ద రోడ్డు పక్కన చుట్టూ చక్కర్లు కొడుతూ సంచరిస్తోoది.
ఎలుగుబంటి ఇలా సంచరిస్తుండగా బైక్ పై అటుగా వచ్చిన వాహనదారుడు ఒక్కసారిగా బల్లూకాన్ని చూసి భయంతో బైక్ ని రోడ్డుపై పడేసి గ్రామంలోకి పరుగులు పెట్టాడు. విషయం తెలుసుకుని ఎలుగుబంటిని చూసేందుకు గ్రామస్తులు తరలిరాగా… అది ఇంకా అక్కడే చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది.
జనాలు ఎలుగుబంటిని సమీపించిన అది ఏమి పట్టనట్టు ఒకే చోట కంటిన్యూగా చుట్టూ తిరుగుతూ తన పని తాను చేసుకుంటుంది. దీంతో ఆశ్చర్యపోతున్నారు స్థానికులు. ఎలుగుబంటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు సైతం తరలివస్తున్నారు.
పలాస అటవిశాఖ డిఎఫ్ఓ తో పాటు సిబ్బంది, పోలీసులూ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎలుగుబంటి వింత ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. ఎలుగుబంటి కి మూతి పై గాయాలు కూడా ఉన్నట్టు గమనించారు. కళ్ళు కనిపించక,భయంతో గాని లేదా ఏదైనా వ్యాధి ప్రభావంతో గాని ఎలుగుబంటి ఇలా ప్రవర్తించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
బస్సు, వైద్యులతో పాటు ఆటో శాఖ ఉన్నతాధికారుల శాతం ఘటన స్థలానికి చేరుకొనున్నారు. మరోవైపు ఎలుగుబంటిని చూసేందుకు జనాలు తరలివస్తుండటంతో వారిని పోలీసులు కట్టడి చేస్తున్నారు.