నరసాపురం మొగల్తూరు నవంబర్ 27 (గోపరాజు సూర్యనారాయణ రావు) ఆంధ్రపత్రిక
మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ గ్రామంలో శుక్రవారం సుంకర వారి మేరకు నందు శ్రీ సుంకర వెంకట శ్రీరాములు (అబ్బులు)-నాగలక్ష్మి దంపతులకు ప్రతిష్టించబడిన శ్రీ అలివేలు మంగ, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈనెల 23వ తేదీ గురువారం ఉదయం సుంకర చంద్రశేఖర్-వీర వెంకట నాగలక్ష్మి దంపతులకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవాలు సోమవారం ఉదయం జరిగిన అన్న సమారాధనతో ముగిసాయి. గ్రామం నలుమూలల నుండి సుమారుగా 2 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదమును స్వీకరించారు.