అధిక సంఖ్యలో కళ్యాణంలో పాల్గొన్న భక్తులు.
పలుచోట్ల భారీ అన్న సమారాధనలు.
వేపాడ,మార్చి,30(ఆంధ్ర పత్రిక):- మండలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి గ్రామంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకరించారు.వేద పండితుల పౌరోహిత్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ముఖ్యంగా మండల కేంద్రంలోని వేపాడ,నీలకంఠ రాజపురం,బానాది, అరిగిపాలెం,సోంపురం,జాకేరు, చామలాపల్లి, జగ్గయ్యపేట, వావిలపాడు గ్రామాల్లో సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అలాగే మండలంలోని మిగతా గ్రామాల్లో కూడా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.కళ్యాణ మహోత్సవం సందర్భంగా సోంపురం, జగ్గయ్యపేట, చామలాపల్లి,ఎన్. కే.ఆర్.పురం గ్రామాల్లో భారీ అన్న సంతర్పణలు ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించి ఆయన కృపకు పాత్రులయ్యారు.వేపాడలో కీర్తిశేషులు గుమ్మడి కృష్ణ పార్వతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు రామ జోగేశ్వరరావు,శ్రీను, నాగేశ్వరరావుల ఆర్థిక సహకారంతో భారీ ఎత్తున అన్న సమారాధాన ఏర్పాటు చేశారు.సోంపురంలో సర్పంచ్ మురిపిండి గంగరాజు, ఎంపీటీసీ సభ్యులు ఆకుల సత్యనారాయణ, వైసిపి మండల యువజన విభాగం అధ్యక్షుడు ఉగ్గిన శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గేదెల సత్యారావు, గొర్రెపోటు రమణ(మాస్టర్), తొండ వరపు మల్లేష్,కోటం శెట్టి గణపతి, దాసరి గురయ్య, అరిగి పాలెంలో సర్పంచ్ దుల్ల లక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు తొండవరపు వెంకటరమణ, దుల్ల సన్యాసిరావు,మిగతా గ్రామ పెద్దలు,చామలాపల్లిలో సర్పంచ్ కోలా సతీష్, జాకేరులో సర్పంచ్ బుద్ధ చిన్నమ్మలు, మాజీ ఉపసర్పంచ్ బుద్ధ అప్పలనాయుడు,బుద్ద కృష్ణ, సూరిబాబు,నరసింహమూర్తి, నీలకంఠరాజుపురంలో డిసిసిబి చైర్మన్ వేచలపు వెంకట చిన రాము నాయుడు, మాజీ ఎంపిటిసి వేచలపు జగ్గు బాబు,చినగుడిపాల సర్పంచ్ బోజంకి రామనాయుడు, బానాదిలో యూత్ సభ్యులు మరియు సర్పంచ్ కర్రి యశోద, మాజీ ఎంపిటిసి గొంప వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!