కె.కోటపాడు,మార్చి31(ఆంధ్రపత్రిక):
మండలంలోని పైడంపేట గ్రామంలో ప్రజలు, పెద్దలు సహకారంతో గురువారం శ్రీరామనవమి పండగలా ఘనంగా జరిగింది. శ్రీరామాలయంలో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. డీజె కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. మధ్యాహ్నం నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు పాల్గొన్నారు. ఎడ్ల పరుగు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.రాత్రి సినీ డూప్స్ వినోద కార్యక్రమం ఆలరించింది. ఎడ్ల పరుగు ప్రదర్శనలో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ రొంగలి రాఘవ, మండల టీడీపీ అధ్యక్షులు రొంగలి మహేష్, మాడుగుల మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ మాడుగుల నియోజకవర్గం ఇంచార్జి పీవీజీ కుమార్, టీడీపీ మాడుగుల నియోజకవర్గం సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు, “డేన్” ఫౌండేషన్ చైర్మన్ దొగ్గ అచ్చిం నాయుడు, చౌడవాడ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, నాయకులు కశిరెడ్డి అప్పలనాయుడు, బండారు నరసింహనాయుడు, బొజ్జ మహాలక్ష్మినాయుడు తదితర్లు పాల్గొన్నారు.