గ్రామమంతా పూలు మామిడితోరణాలతో అలంకరణ.
ప్లాస్టిక్ ప్లేట్లను నిషేదిస్తూ అరటిఆకుల్లో భోజనాలు.
120మంది యువతకు స్వామివారి టీ షర్టులు వాకిటాకీలు.
ఆదర్శంగా నిలిచిన ఎన్.ఎన్.ఆర్ కన్స్ట్రక్షన్ గ్రూపు అధినేత నంబూరి.
వేపాడ,మార్చి,30(ఆంధ్ర పత్రిక ):- అనుభవం వయసు కన్నా మంచి మనసు ముఖ్యం.ధనం కంటే మంచి గుణం ముఖ్యం.కులమతాల కన్నా అభిమతం మిన్న.ఇటువంటి సుగుణాలు గల వ్యక్తులు నేటి సమాజంలో అరుదుగానే కనిపిస్తారు.కానీ మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన నంబూరి రవికుమార్ వ్యవహార శైలి గమనిస్తే రాజకీయాలు,పార్టీలు, కులమతాలకు అతీతుడైన అందరి వాడని పేర్కొన వచ్చు. వివరాల్లోకి వెళ్తే మండలంలో పాటూరు గ్రామం సమస్యాత్మకమైన గ్రామంగా గుర్తింపు ఉంది.ఈ గ్రామంలో రాజకీయాలు వర్గాలు కూడా ఎక్కువే.గ్రామంలో ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరదు.అలాంటి పాటూరు గ్రామంలో పుట్టి పెరిగిన నంబూరి రవికుమార్ ఉన్నతమైన భావజాలంతో కనస్ట్రక్షన్ రంగం ఎంచుకొని విశాఖలో ఎన్.ఎన్.ఆర్ కనస్ట్రక్షన్ గ్రూపును ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదిగిన ఆయన గ్రామాన్ని సన్మార్గంలో నడిపించి అభివృద్ధి పధంలో నడిపించాలన్న దృక్పదంతో శ్రీరామనవమిని వేడుకగా చేసుకున్నారు.ఈ మేరకు గ్రామంలో గల రెండు రామాలాయాలను పూలు,మామిడి తోరణాలతో ముస్తాబు చేయించారు.అలాగే గ్రామమంతా కూడా ముస్తాబు చేసిఅందరిలో భక్తి భావం కలిగేలా తీర్చిదిద్ది రెండు రామాలయాల్లో కూడా వేదపండితుల మంత్రాలతో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాలను వైభవంగా జరిపించారు.గ్రామంలో ఎక్కడ ఎటువంటి లోపాలు చోటుచేసుకోకుండా చూసేందుకు 120మంది యువకులకు శ్రీసీతారాములవారి టీ షర్టులను,వాకిటాకీలను సమకూర్చారు.అలాగే భోజనాల నిర్వహణకు ప్లాస్టిక్ ప్లేట్లను నిషేధించి అరటి ఆకులను సమకూర్చి సహపంక్తి భోజనాలు వడ్డించి శబాస్ అనిపించారు.ఖర్చుకు వెనుకాడకుండా స్థానిక వినాయకుడి గుడికి రంగులు వేయించి మైక్ సెట్ ను సమకూర్చారు. అలాగే గ్రామంలోని రెండు రామాలయాలకు కూడా అన్ని హుంగులు సమకూర్చడానికి కృతనిచ్చయంతో ఉండగా గ్రామమంతా ఒకటే మనుషులంతా ఒకటే అన్న మంచి భావంతో ముందడుగు వేస్తున్న నంబూరి రవికుమార్ తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!