అక్టోబర్ 17 (ఆంధ్రాత్రిక): మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి ఇండస్ట్రీలో హీరోగా నిలదిక్కుకోడానికి బాగా కష్టపడుతున్నాడు. ’మత్తు వదలరా’ సినిమాతో హీరోగా పరిచయమైన సింహా.. ’తెల్లవారితే గురువారం’ ’దొంగలున్నారు జాగ్రత్త’ వంటి చిత్రాలతో అలరించారు. ఇప్పుడు ’భాగ్ సాలే’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్నాడు. శ్రీ సింహా హీరోగా నూతన దర్శకుడు ప్రణీత్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన కైమ్ర్ కామెడీ చిత్రం ’భాగ్ సాలే’. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన మేకర్స్.. తాజాగా ’కూత ర్యాంప్’ అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. అయితే ఈ పాటలో ఉపయోగించిన లిరిక్స్ మరియు శ్రీ సింహా స్టెప్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ’పైకే క్లాస్ లోన ఊర మాసులే.. మామా ఎవడిదైనా మాట అస్సలు విననులే.. అయినా మనల్ని మించిన తోపు ఇక్కడ ఎవడులే’ అంటూ సాగిన ఈ పాటకు శ్రీ సింహా సోదరుడు కాలభైరవ సంగీతం సమకూర్చడమే కాదు.. స్వయంగా ఆలపించారు. శ్రీ సింహా ఓ బూతు పదాన్ని సౌండ్ బయటకు రాకుండా ఉచ్చరించడంతోనే ఈ పాట ప్రారంభమైంది. ఇటీవల కాలంలో సోషల్ విూడియాలో యువతలో ట్రెండ్‌గా మారిన ’కూత ర్యాంప్’ వంటి ఊతపదాలతో నిండిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. ట్రెండ్ కు అనుగుణంగా యూత్‌ను ఆకట్టుకునే లిరిక్స్ మాత్రమే కాదు.. భాను మాస్టర్ కంపోజ్ చేసిన క్రేజీ హుక్ స్టెప్ కూడా ఈ పాట తక్షణమే వైరల్ కావడానికి కారణమైంది. సక్సెస్ కోసం కీరవాణి తనయుడు ఈసారి కాస్త ట్రాక్ మార్చినట్లుగా ’కూత ర్యాంప్’ సాంగ్‌ని బట్టి అర్థమవుతోంది. శ్రీ సింహా సరసన నేహా సోలంకి హీరోయిన్గా నటించింది. జాన్ విజయ్`రాజీవ్ కనకాల`వెన్నెల కిషోర్`సత్య`నందినీరాయ్ `సుదర్శన్ `వంశీ నెక్కంటి `వర్షిణి `వైవా హర్ష `కిడ్ చక్రి `జయవాణి `బాష `యాదం రాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బిగ్ బెన్ సినిమా మరియు సినీ వ్యాలీ మూవీస్ తో కలిసి వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో ’భాగ్ సాలే’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!