గూడూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక) : గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నూతనంగా నియమించ బడిన గృహ సారథులతో ఆత్మీయ సమావేశం గూడూరు ఎమ్మెల్యే వరప్రసా ద్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ మరియు నియోజక వర్గంలోని మండలాల గృహ సారథులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తూ మరోవైపు పార్టీ ప్రతిష్టతకు అనేక చర్యలు తీసుకుంటు న్నారని ,దీనిలో భాగంగా నూతనంగా గృహ సారధులను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వీరంతా కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఎక్కడైనా పార్టీ కి నష్టం కలుగుతుంటే వెంటనే తెలియచేయాలని సూచించారు. పార్టీ కి పనిచేసిన వారికి మరల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ సీ.ఈ. సి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి , వైసీపీ సీనియర్ నాయకులు బత్తిని విజయ కుమార్ , నాసిన నాగులు , రాజేశ్వర రెడ్డి , మోహన్ , మురళి , రాజా , నరసయ్య , తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!