మచిలీపట్నం సెప్టెంబర్ 12 ఆంధ్ర పత్రిక. :
ఫోటో ఓటర్ల జాబితాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల ఫిర్యాదులపై పరిష్కార చర్యలు తీసుకోవాలని
జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నదని, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ జిల్లాల్లో ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు.
కలెక్టర్ బంగ్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం పురోగతి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.
జిల్లాలో జరుగుతున్న ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం సంబంధించి ఇంటింటి వెరిఫికేషన్ పూర్తయిందన్నారు.
ఓటర్ల జాబితాల ఇంటింటి వెరిఫికేషన్ లో ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాని వారిని గుర్తించి, అట్టి వారి నుండి ఫారం- 6 సేకరించి ఓటరుగా నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు, మరణించిన ఓటర్ల ను తొలగించుటకు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎక్కడైనా ఏనియోజకవర్గంలోనైనా ఫారం-6 అధిక సంఖ్యలో వచ్చిన సందర్భాల్లో సమగ్ర పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఫారం-7, ఫారం-8 ప్రస్తుత పరిష్కార స్థితి వివరించారు.
ఎన్నికల సంఘం నిబంధనలు అనుసరించి పోలింగ్ కేంద్రాల రేషన లైజేషన్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా ఫోటో ఓటర్ల జాబితాల సంక్షిప్త సవరణ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదులపై తగిన వెరిఫికేషన్ నిర్వహించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు వీడియో కాన్ఫరెన్స్ లోపాల్గొన్నారు.