నరసాపురం అక్టోబర్ 14( ఆంధ్ర పత్రిక గోపరాజు సూర్యనారాయణ రావు)
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శనివారం ఉదయం ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం మొగల్తూరు గ్రామం పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలను తిలకించారు.పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.