పేరుపాలెం శ్రీమత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మొగల్తూరు ఏప్రిల్ 15 ఆంధ్ర పత్రిక (గోపరాజు సూర్య నారాయణరావు) పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామం మాల పర్రు బీచ్లో వేంచేసియున్న శ్రీ శ్రీమత్యనారాయణ స్వామివారి ఆలయం నందు శనివారం ఉదయం ఎలమంచిలి మండలం కాజా గ్రామానికి చెందిన గోటేటి రామలింగేశ్వర రావు-ప్రసన్న రాణి, శేష సాయి, మహిదర్ సావిత్రి శ్రీ నికిత సూర్యా శ్రీ సాయి, అమృత కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి ఆర్థిక సహకారంతో ఆలయ ఆవరణలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన పర్యవేక్షణ నిర్వహించారు.