ఇక, ఈ పట్టణానికి ఆర్టీసీ భారీగా ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. త్వరలోనే ఈ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ఈ 82 ఎలక్ర్టిక్ బస్సులను దశలవారీగా నడపనున్నారు. వరంగల్-హైదరాబాద్ మధ్య నడిచే ఈ బస్సుల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ 18 ఉండగా, డీలక్స్ బస్సులు 14, సెమీ డీలక్స్ బస్సులు 21, ఎక్స్‌ప్రెస్ బస్సులు 29 ఉన్నాయి.
జేబీఎం సంస్థ..
ఇక, ఈ ఎలక్ర్టిక్ బస్సులను ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఒలెక్ట్రా కంపెనీ బ్యాటరీ బస్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ రెండు పర్యాయాలు బస్సులను సరఫరా చేసింది. అయితే, మూడో ప్రయత్నంలో మాత్రం ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ ఈ టెండర్ దక్కించుకుంది. ఇప్పడు కాంట్రాక్టు పద్ధతిలో 82 ఎలక్ర్టిక్ బస్సులను నడుపనున్నారు. అయితే, ఇటీవలే ఆర్టీసీ కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్, నిజామాబాద్ నుంచి ప్రారంభించింది. కానీ, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా విస్తరిస్తోన్న వరంగల్‌కు ఎక్కువ బస్సులు కేటాయించారు.
82 ఎలక్ట్రిక్ బస్సులు..
వరంగల్ జనాభా, విస్తీర్ణం పరంగా పెద్ద పట్టణంగా మారింది. అందుకే వరంగల్‌కు ఎక్కువ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 82 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. వీటిని వరంగల్-2 డిపో ఆధ్వర్యంలో నడపనున్నారు.
హైదరాబాద్ టు వరంగల్ మధ్య బస్సులు ఎక్కువగా నడుస్తాయి. నిత్యం ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రెండు ప్రాంతాల మధ్య అదనంగా కొత్త బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. జేబీఎం సంస్థ బస్సులను సరఫరా చేసేవరకు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నారు.
హైదరాబాద్‌కే ఎక్కువ బస్సులు..
అయితే, మొదటిసారి హైదరాబాద్ వెలుపల కాకుండా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఇక వరంగల్‌కు సరఫరా చేసే ఎలక్ట్రిక్ బస్సుల్లో మూడొంతులు హైదరాబాద్ మార్గంలోనే నడపనున్నారు. వరంగల్-2 డిపోలో సిద్ధం చేసిన సెంటర్లో బ్యాటరీ చేయాల్సి ఉంటుంది. అక్కడ బ్యాటరీ చార్జ్ చేసి పంపాక, తిరుగు ప్రయాణం కోసం మళ్లీ ఈ బస్సులకు చార్జ్ చేయాల్సి ఉంటుంది. కాగా, హైదరాబాద్‌లో ఎక్కువ చార్జింగ్ పాయింట్లు ఉన్నందున హైదరాబాద్‌కే ఎక్కువ బస్సులు నడపనున్నారు.
కరీంనగర్, నిజామాబాద్‌లకు కూడా..
అయితే, చార్జీంగ్ సెంటర్లను కరీంనగర్, నిజామాబాద్‌ల్లో కూడా ఏర్పాటు చేయడంతో అక్కడికి కూడా బస్సులు తిరగనున్నాయి. దీంతో కొన్ని బస్సులను వరంగల్ నుంచి ఆ రెండు నగరాలకు కూడా నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌కే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నందున ప్రస్తుతం హైదరాబాద్ టు వరంగల్ మధ్య నడుస్తున్న డీజిల్ బస్సుల్లో కొన్నింటిని వరంగల్ నుంచి ఇతర ప్రాంతాల మధ్య నడిపేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు