- రాహుల్‌తో కలిసి నడక..!
- మైసూర్లో వైభవంగా దసరా ఉత్సవాలు
- ఉత్సవాల్లో పాల్గొన్న సిఎం బొమ్మై
- కర్నాటక ఉత్సవాల్లో హాజరైన సోనియా
బెంగళూరు,అక్టోబర్6(ఆంధ్రపత్రిక: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. గురువారం ఉదయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని జకన్నహళ్లికి చేరుకొన్నారు. పాండవపుర తాలుకాలో ఉదయం 6.30కు మొదలైన యాత్ర అక్కడకు చేరుకోగానే.. ఆమె కూడా వారితో కలిసి నడిచారు. మైసూర్లో వైభవంగా దసరా ఉత్సవాలు ఉత్సవాల్లో పాల్గొన్న సిఎం బొమ్మై కర్నాటక ఉత్సవాల్లో హాజరైన సోనియా కర్ణాటకలోని మైసూర్లో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అసంఖ్యాకంగా తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై పాల్గొన్నారు. దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. నవరాత్రి వేడుకలను విజయ దశమితో కలిపి పదిరోజులు జరుపుతారు. మైసూరు దసరా వేడుకలకు 5 వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చారు. మైసూర్లో జరిగే దసరా వేడుకలు అమ్మవారి పూజలకే పరిమితం కాదు. ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను కూడా తెలియజేస్తాయి. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైసూరు జిల్లా బేగూరులోని భీమన్ కొల్లి ఆలయంలో సోనియా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనయుడు రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆమె కర్ణాటకకు వచ్చారు. దసరా ఉత్సవాల సందర్భంగా రాహుల్ పాదయాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించగా.. ఇవాళ పండుగ సందర్భంగా మైసూరు జిల్లా హెచ్ డీ కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని భీమన్ కొల్లి ఆలయంలో దసరా పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయంలో సోనియా కొద్దిసేపు గడిపారు. సోనియాకు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.