వైద్య పరీక్షల కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి విదే శాలకు వెళ్తున్నారు.తల్లికి తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ కూడా వెళ్లనున్నారు.ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలియ జేసింది. సోనియాగాంధీ మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్నారని ఇదే సమయంలో అనా రోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి వద్దకు కూడా ఆమె వెళ్తారని ఒక ప్రకటనలో జైరాం రమేశ్ తెలిపారు.సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక కూడా వెళ్లనున్నారని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 4న ఢల్లీిలో జరిగే ‘మెహంగాయ్ పర్ హల్లా బోల్’ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని తెలి పారు.మరోవైపు, సెప్టెంబర్ 7న కన్నియాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ చేపట్టే ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభం కానుంది. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగ బోతోంది.ఈ ఎన్నికకు సంబంధించి ఈవారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్న తరుణంలో సోనియా మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్నారు.మరోవైపు, సోనియా చెకప్ కోసం ఏ దేశానికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారనే విషయాలపై మాత్రం పార్టీ క్లారిటీ ఇవ్వలేదు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!