ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర కార్యదర్శి పాత్రుడు డిమాండ్
వేపాడ, నవంబర్ 1 (ఆంధ్రపత్రిక) : మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చాలని ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర కార్యదర్శి పాత్రుడు డిమాండ్ చేశారు. మంగళవారం మండల నాయకుడు యుగేందర్ తో కలిసి ఆయన నీలకంఠరాజుపురం జిల్లా పరిషత్ పాఠశాలను,మోడల్ స్కూల్ ను సందర్శించారు.ఈ సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర కార్యదర్శి పాత్రుడు మాట్లాడుతూ ఎన్.కె.ఆర్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారని, విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టకపోవడం, మరియు మెనూ సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు కూరగాయలు, పప్పు దినుసులను తక్కువ మోతాదులో ఉపయోగించడం,విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయున్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆయన అనుమతితోనే మెనూ సక్రమంగా నిర్వహించకపోవడం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ సందర్శిం చగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకపోవడంతో పాత పుస్తకాలతో విద్యను అభ్యసించడం కష్టంగా ఉందన్నారనీ, అలాగే విద్యార్థులకు వారానికి ఒక్కసారైనా విద్యార్థులకు క్రీడలను నిర్వహించకపోవడం వంటి విషయాలు మా దృష్టికి వచ్చాయన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికైనా మేల్కొని విద్యార్థులను సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నాయకులు తరుణ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.