మచిలీపట్నం, నవంబర్ 21 ఆంధ్ర పత్రిక.
రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర కరువు సమస్య పై సి .పి. ఐ. ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ వద్ద చేపట్టిన 30 గంటలు నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మర్రి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతూ
రాష్ట్రంలో తీవ్రమైన కరువు సమస్య, వల్ల రైతాంగం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని అన్నారు. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. కృష్ణా జలాల పునః పంపిణీకై , కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ల పై, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల పై మొండివైఖరిని ప్రదర్శిస్తోందని దీనిని నిరసిస్తూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 30 గంటల నిరాహార దీక్ష కి సంఘీభావం తెలియ జేస్తున్నామన్నారు . ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శివల్లూరు పల్లి గణేష్ కృష్ణాజిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షులు వేముల శివాజీ
కృష్ణాజిల్లా తెలుగు రైతు సోషల్ మీడియా కోఆర్డినేటర్ పామర్తి లక్ష్మణ్
మచిలీపట్నం కార్పొరేట్ తెలుగు రైతు అధ్యక్షులు ఏ.మాధవ, మరియు ఈమని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.