– మిల్లెట్స్ నిపుణులు రాంబాబు
విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రపత్రిక): చిరు ధాన్యాలు ఆరోగ్యకరం అని చిరుధాన్యాలు నిపుణులు రాంబాబు అన్నారు. ఆదివారం గురుద్వరా దగ్గర్లో ఉన్న స్మార్ట్ ఇన్ సమావేశ మందిరంలో గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నిర్వహించిన సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. చిరుధాన్యాలను ఎనిమిది గంటలు నాన బెట్టి వండుకోవాలన్నారు. చిరుధాన్యాలు వందినప్పుడు వచ్చే గంజి తరువాతి రోజు తీసుకోవడం చాలా ఆరోగ్యకమైనది , శరీరానికి అవసరమైన పోషకాలు వుంటాయని వివరించారు. అల్లం, వెల్లుల్లి, మజ్జిగ మంచి బ్యాక్టీరియా ను పెంచుతుందని పేర్కొన్నారు. చిరుధాన్యాలు నానబెట్టి , ఎండలో ఆరబెట్టి వాటిని పిండి చేసుకోవటం మంచిదన్నారు. అరబెట్టెందుకు నేతబట్ట వినియోగించాలని కోరారు. బాగా పోలిష్ చేసిన ఆహార ధాన్యాలు ఆరోగ్యం కాదన్నారు. సముద్ర ఉత్పత్తుల్లో ఎక్కువగా విషతుల్య రసాయనాలు ఉంటున్నాయన్నారు. చద్దన్నం తినడం మంచి అలవాటు అన్నారు. రాగులతో చేసిన అల్వా వల్ల చాలా ఉపయోగాలున్నాయి అని ఆయన వివరించారు. తెల్లవారిన తరువాత ఎండ మంచిదన్నారు. డీ విటమిన్ ఉదయపు ఎండ నుంచి వస్తుందని వివరించారు.శరీరానికి గానుగ ఆడించిన నూనె శరీరానికి రాసుకుని కొంత సేపు ఎండలో ఉండి స్నానం చేయడం ఆరోగ్యకరం అని వివరించారు. ఆహారం తో పాటు ప్రతి రోజూ ప్రాణాయామం తప్పని సరిగా చేయాలని సూచించారు. ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుందని తద్వారా తీసుకొనే ఆహారం తేలికగా అరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జలగం కుమారస్వామి, గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు దాట్ల వర్మ, అశోక్, ఎం.యుగంధర్ రెడ్డి, జే వీ రత్నం, రుషి తదితరులు పాల్గొన్నారు.