స్కర్దు నగరం ఇప్పుడు పాకిస్తాన్ పాలిత గిల్గిత్ బాల్టిస్తాన్‌లో భాగంగా ఉంది.
మేజర్ విలియం బ్రౌన్ 1947లో గిల్గిత్ స్కౌట్స్ బ్రిటిష్ కమాండర్. ఆయన ఓ తిరుగుబాటులో భాగం కాబోతున్నారు.
దాని ఫలితంగా ఓ స్వతంత్ర రాజ్యం ఏర్పడబోతోంది. దానిని ఆజాద్ కశ్మీర్ అని పిలుస్తారు.
“కశ్మీర్ మహారాజు తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయబోతున్నారని గిల్గిత్‌లో ఒక పుకారు పుట్టింది. దీంతోపాటు స్కౌట్స్ తిరుగుబాటు చేసే అవకాశముందనే ప్రచారమూ మొదలైంది” అని బ్రౌన్ చెప్పారు.
‘పాకిస్తాన్ జిందాబాద్’, ‘కశ్మీర్ మహారాజు డౌన్ డౌన్’ అనే నినాదాలను గవర్నర్ ఇంటితో సహా ప్రతిగోడపైనా రాశారు.
”తన ఇంటిపై రాసిన నినాదాలను గవర్నర్ స్వయంగా తుడిచివేయడం నేను చూశాను. కానీ తరువాత రోజు ఉదయానికల్లా మా ఇంటి గేటు దగ్గరా నినాదాలు రాశారు” అని బ్రౌన్ చెప్పారు.
ఈ ప్రాంతంలో గిల్గిత్‌తో పాటు స్కర్దు నగరం కూడా ఉంది. ఇప్పడీ ప్రాంతం పాకిస్తాన్ పాలిత గిల్గిత్-బాల్టిస్తాన్‌లో భాగంగా మారింది.
ఈ కథ 1947లో గిల్గిత్‌లో మొదలైంది.
అది భారత్, పాకిస్తాన్ స్వాతంత్య్రం పొందిన సమయం.
కానీ, జమ్ము కశ్మీర్ సహా కొన్ని రాజాస్థానాల విలీనం వివాదాస్పదంగా మారింది.
ఆ సమయంలో గిల్గిత్‌లో ఉన్న మేజర్ బ్రౌన్ తను రాసిన ‘గిల్గిత్ రెబెలియన్: ద మేజర్ హూ మ్యూటినీడ్ ఓవర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో దీని గురించి రాశారు.
1947 అక్టోబర్ 25 సాయంత్రం కశ్మీర్‌కు సైన్యాన్ని పంపాలని భారత్ నిర్ణయించిందనే వార్త తెలిసింది.
అంతకు కొన్నిరోజుల ముందు ‘గిరిజన దళాలు’ ముజఫరాబాద్ మీదుగా కశ్మీర్‌పై దాడి చేసి శ్రీనగర్ సమీపానికి చేరుకున్నాయి.
గిల్గిత్-బాల్టిస్థాన్ ఆ సమయంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉండేది.
సోషియాలజీ అధ్యాపకుడు సయీద్ అహ్మద్ తన పుస్తకం ‘ది గిల్గిత్-బాల్టిస్తాన్ కానండ్రమ్: డైలమాస్ ఆఫ్ పొలిటికల్ ఇంటిగ్రేషన్’లో అప్పట్లో జమ్మూకశ్మీర్ నాలుగు భాగాలుగా అంటే జమ్మూ ప్రావిన్స్, కశ్మీర్ ప్రావిన్స్‌తోపాటు గిల్గిత్, లద్దాఖ్ జిల్లాలుగా ఉండేదని రాశారు.
కానీ 1935లో బ్రిటిషర్లు గిల్గిత్ పాలనను డోగ్రా పాలకుడి నుంచి 60 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు. బాల్టిస్తాన్ మాత్రం డోగ్రా ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండేది.
భారత్, పాకిస్తాన్ స్వాతంత్య్రం పొందడానికి సరిగ్గా రెండు వారాల ముందు బ్రిటన్ హఠాత్తుగా ఈ లీజును రద్దు చేసింది. దీని తరువాత 1947 జులై 30న కశ్మీర్‌లో పని చేసే బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ స్కాట్ గిల్గిత్ చేరుకున్నారు.
ఆయనతోపాటు బ్రిగేడియర్ ఘన్‌సారా సింగ్ ఉన్నారు. ఆయనను కశ్మీర్ మహారాజు గవర్నర్‌గా నియమించి గిల్గిత్‌కు పంపారు.
అప్పటి వరకు కశ్మీర్ రాజు తన సంస్థానాన్ని పాకిస్తాన్ లేదా భారతదేశంలో విలీనం చేయాలని నిర్ణయించుకోలేదు.