కీలక భూమికలో కమెడియన్ సునీల్
నవంబర్ 09 (ఆంధ్రపత్రిక): కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుంటున్న నటుడు శివకార్తికేయన్. ’రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ.. ’డాక్టర్’, ’డాన్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన ’ప్రిన్స్’ రిలీజై యావరేజ్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ’జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ ’మహావీరుడు’ సినిమా చేస్తున్నాడు. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ కామెడీయన్ సునీల్ నటిస్తున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడిరచింది. టాలీవుడ్ స్టార్ కమెడీయన్‌గా పేరు సంపాదించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగా మారి ప్లాప్‌లు మూటగట్టుకున్నాడు. మళ్ళీ ఈ మధ్య కమెడీయన్‌గా ఫుల్ బిజీ అయిపోయాడు. కాగా తాజాగా మహావీరుడు చిత్రంలో సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెరకెక్కి?స్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడీగా డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. శాంతీ టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భరత్ శంకర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.