హైదరాబాద్ ; తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ఇవాళ (మంగళవారం) తెలంగాణ మంత్రి సీతక్క రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.
గవర్నర్తో భేటీ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు.
” 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్కు పంపింది. రెండు సంవత్సరాలుగా పెండింగ్లోనే ములుగు మున్సిపాలిటి అంశం ఉంది. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలుపాలని ఈ సందర్భంగా గవర్నర్కు విజ్ఞత్తి చేశాం. అదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేసాం.
అదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్ను కొరాం. గవర్నర్ ములుగులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్కు పంపాం, అదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాము” అని సీతక్క పేర్కొన్నారు.