ఇటీవల నవీ ముంబై పోలీసులు ఓ సంక్లిష్టమైన సైబర్ చోరీని ఛేదించారు. ఇక్కడ ఒక వ్యక్తి నకిలీ సిమ్ కార్డ్ ను ఉపయోగించి కంపెనీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేశాడు. దానిలో రూ. 18.74 లక్షలతో కాజేసి పరారయ్యాడు. కంపెనీ టెలికమ్యూనికేషన్స్ సేవల లాగిన్ ఆధారాలను మార్చడం ద్వారా సదరు వ్యక్తి కార్పొరేట్ బ్యాంక్ ఖాతాల్లోకి చొరపడ్డాడు. ఆ కంపెనీ సెప్టెంబర్ ఫిర్యాదు ఇవ్వడంతో సైబర్ పోలీసులు సమగ్ర విచారణను ప్రారంభించారు.
అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతికతను చూసి ఆహా! అనే లోపు.. అమ్మో! అనేలా చేస్తోంది. ఇటీవల వెలుగుచూస్తున్న ఉదంతాలు ఆందోళన స్థాయిలను పెంచుతున్నాయి. ప్రజలకు ఆన్ లైన్లో భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. సైబర్ సెక్యూరిటీకి పెను సవాళ్లు విసురుతోంది. ఇటీవల నవీ ముంబై పోలీసులు ఓ సంక్లిష్టమైన సైబర్ చోరీని ఛేదించారు. ఇక్కడ ఒక వ్యక్తి నకిలీ సిమ్ కార్డ్ ను ఉపయోగించి కంపెనీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేశాడు. దానిలో రూ. 18.74 లక్షలతో కాజేసి పరారయ్యాడు. కంపెనీ టెలికమ్యూనికేషన్స్ సేవల లాగిన్ ఆధారాలను మార్చడం ద్వారా సదరు వ్యక్తి కార్పొరేట్ బ్యాంక్ ఖాతాల్లోకి చొరపడ్డాడు. ఆ కంపెనీ సెప్టెంబర్ ఫిర్యాదు ఇవ్వడంతో సైబర్ పోలీసులు సమగ్ర విచారణను ప్రారంభించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మొదటి సమాచార నివేదిక (FIR)లో ఈ నేరానికి సంబంధించిన వివరాలు పొందుపరిచారు. ఆ సంస్థ బ్యాంకు ఖాతాను లాగిన్ వివరాలను సిమ్ కార్డు సాయంతో మార్చేశారని గుర్తించారు. ఈ చోరీ పాల్పడింది పశ్చిమ బెంగాల్‌కు చెందిన నూర్ ఇస్లాం సన్‌ఫుయ్ అనే వ్యక్తి అని నిర్ధారించారు. ఈయన బ్యాంకులోని ఆ సంస్థకు చెందిన వ్యక్తి ఖాతా వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు.
ఎలా చేశాడంటే..
నిందితుడు దీని కోసం సిమ్ స్వాపింగ్ లేదా సిమ్ హైజాకింగ్ టెక్నాలజీని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. అంటే ఖాతా కలిగిన వ్యక్తికి చెందిన ఫోన్ నంబర్ అది కూడా ఆ ఖాతాకు అనుసంధానమైనా నంబర్ ను డియాక్టివేట్ చేసి.. అదే నంబర్ తో వేరే సిమ్ తీసుకున్న నిందితుడు వెంటనే యాక్టివేట్ చేయడమే కాకుండా.. లాగిన్ వివరాలను ఆ సిమ్ కార్డుతో ఓటీపీలను తీసుకొని కొత్త లాగిన్ పాస్ వర్డ్ సెట్ చేసుకొని ఆ ఖాతాను కొల్లగొట్టాడని పోలీసులు చెబుతున్నారు. ఇదెలా సాధ్యం అంటే మొదటగా నేరగాడు మీ సిమ్ ఎవరి పేరుపై ఉంది.. సిమ్ కార్డు జత చేసిన ప్రూఫ్ ఎంటి అన్న విషయాలు తెలుసుకుంటారు.. ఆ తర్వాత టెలికాం ప్రొవైడర్ కు ఫోన్ చేసి, తమ సిమ్ కార్డుపోయిందని చెబుతారు. నంబర్ తో సహా టెలికాం ప్రొవైడర్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి.. ఆ ఒరిజినల్ సిమ్ ను బ్లాక్ చేస్తారు. దీంతో ఆ సిమ్ కు మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వెళ్లడం ఆగిపోతాయి. వెంటనే ఇంకో సిమ్ ను అదే నంబర్ తో యాక్టివేట్ చేసి ఖాతాలను హ్యాక్ చేస్తారు. ఈ సిమ్ స్వాపింగ్ తో బ్యాంక్ ఖాతాలు మాత్రమే సోషల్ మీడియా ప్రొఫైల్‌లు, ఈ-మెయిల్‌ల వంటి అన్ని ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అప్రమత్తత అవసరం..
పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో నిర్లిప్తంగా ఉండొద్దని చెప్పారు.