రావులపాలెం,పిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక): మండల పరిధి కొమరాజులంకలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ వీరేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష రుద్రాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కర్రి ధర్మారెడ్డి, వరలక్ష్మిల కుమారుడు కర్రి రామకృష్ణారెడ్డి, తులసి విజయలక్ష్మి దంపతులు అమ్మవారికి రూ. 3లక్షలతో సుమారు 3కేజీల వెండితో తయారు చేయించిన వెండి చీరను అందించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారికి అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో హోమాన్ని ఏర్పాటు చేసి రామకృష్ణారెడ్డి, విజయలక్ష్మి దంపతులు పూజలు చేశారు. అనంతరం స్వామి
అమ్మవార్లకు లక్ష రుద్రాభిషేక కార్యక్రమాన్ని, గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!