సీఎం కేసీఆర్ ఆశయం.. సిద్దిపేట ప్రజల దశాబ్ధాల కల ఇక నెరవేరే సమయం రానే వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి కల ఇవాళ నెరవేరనుంది. సొంతూరికి రైలుపై వెళ్లాలన్న కల నిజం కానుంది. నేడు సిద్దిపేట జిల్లాలో రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. దీంతో సిద్ధిపేట వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆశయం, కృషి.. సిద్దిపేట ప్రజల దశాబ్ధాల కల.. ఇక నెరవేరే సమయం రానే వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి కల ఇవాళ నెరవేరనుంది. సొంతూరికి రైలుపై వెళ్లాలన్న కల నిజం కానుంది. నేడు సిద్దిపేట జిల్లాలో రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. దీంతో సిద్ధిపేట వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ తొలి రైలు సర్వీసును జెండా ఊపి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య నూతన రైలు మార్గాన్ని కూడా ప్రారంభిస్తారు. నిజామాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..తొలి రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు.కానీ సికింద్రాబాద్ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.
కాగా.. సిద్దిపేట రైల్వేస్టేషన్లో మంత్రి హరీశ్‌రావు మధ్యాహ్నం 3 గంటలకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరైలు సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. రేపటి నుంచి సిద్దిపేట-సికింద్రాబాద్ మార్గాల్లో రెండు సార్లు రైలు రాకపోకలు సాగించనుంది.
సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు మొత్తం 116 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంది. సికింద్రాబాద్‌లో బయలుదేరిన ట్రైన్.. మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగనుంది. అయితే.. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైలు టికెట్ ఛార్జీ రూ. 60గా ఉంది. సిద్ధిపేట, సికింద్రాబాద్‌ల మధ్య నడుస్తోన్న బస్సు ఛార్జీలతో పోల్చితే రైలు ప్రయాణం సగం అని చెప్పాలి.
సిద్దిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ సిద్ధపేట నుంచి ప్రయాణికుల రైలు పరుగులు తీయనుంది. దీంతో నర్సాపూర్ రైల్వేస్టేషన్లో సందడి నెలకొంది. రైల్వేస్టేషన్ బోర్డు వద్ద స్థానికులు సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు.ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేశారు. తొలి రైలు కూత కోసం ఇప్పటికే స్టేషన్‌ను ముస్తాబు చేశారు.