నక్కపల్లి, నవంబర్ 3, (ఆంధ్రపత్రిక) : ఈనెల 24వ తేదీన ఉత్తరప్రదేశ్ లో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు పాయకరావుపేట శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి వంగలపూడి జగన్ ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ వివిఎస్ఎస్ భానుమూర్తి గురువారం స్థానిక విలేకరులకు తెలిపారు.తమ విద్యార్థి గత నెల 29,30 తేదీల్లో జడ్.పి.ఉన్నత పాఠశాల రేణిగుంట, తిరుపతి జిల్లాల్లో జరిగిన రాష్ట్రస్థాయి రెండవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాడేట్స్, 63 కేజీల వెయిట్ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం సాధించారాన్నరు.విద్యార్థి జగన్ ఇందులో రజిత పతకం సాధించడమే కాకుండా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ వివిఎస్ఎస్ భానుమూర్తి తెలిపారు.తమ విద్యార్థి జగన్ జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు కావడం హర్షణీయమన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి జగన్ ను విద్యాసంస్థల అధినేత సిహెచ్ వి కే నరసింహారావు,సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ ప్రకాష్,ఉపాధ్యాయులు,సిబ్బంది విద్యార్థులు, తల్లిదండ్రులు పలువురు అభినందించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!