విజయవాడ, సెప్టెంబర్ 19 ఆంధ్ర పత్రిక.
ఈ రాష్ట్రం లో దేవాలయానికి వెళ్ళడానికి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా….? సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్..
జగన్మోహన రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు.
ఇది అంబేద్కర్ రాజ్యాంగమా…? లేక రాజారెడ్డి రాజ్యాంగమా….? అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ ఘాటుగా స్పందించారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ ని పోలీసులు అక్రమ నిర్బంధం చేయడం పట్ల రవీంద్ర, వేదవ్యాస్ నిరసన వ్యక్తం చేశారు.
ఎటువంటి నోటీసు అందజేయకుండా తమను ఇంటి నుంచి బయటికి వెళ్ల డానికి వీల్లేదని చెప్తున్న పోలీసుల తీరు పట్ల రవీంద్ర, వేదవ్యాస్ నిరసన తెలిపారు.
ఏ హక్కు తో తమల్ని అడ్డుకుంటున్నారని, అరెస్ట్ చేస్తున్నారని పోలీసులతో కొల్లు రవీంద్ర, బూరగడ్డ వేదవ్యాస్ వాదించారు.
నారా చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం తెదేపా ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయడానికి తాము వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు భావ్యం? అని అన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే దేవాలయానికి వెళ్ళడానికి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అగమ్య గోచర పరిస్థితి దాపురించిందని అన్నారు. జగన్ మోహన రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని రవీంద్ర, వేదవ్యాస్ అన్నారు.
అక్రమ అరెస్టుపై పోలీసులను సూటిగా ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర..!
తనను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని మీడియాతో అంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్..!