మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పుల్లో ముగ్గురు మృతి
మరో పది మందికి గాయలు
గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలింపు
న్యూయార్క్ ,ఫిబ్రవరి 14 : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పల్లో ముగ్గురు మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలోకి చొరబడ్డ అగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్టూడెంట్స్ , విద్యార్థులు, సిబ్బంది వెంటనే తరగతి గదుల్లోకి పారిపోయారు. కాల్పుల తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని..మరో పది మంది వరకు గాయపడ్డారని వర్సిటీ సిబ్బంది తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు..నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!