కీవ్,సెప్టెంబరు 25 (ఆంధ్రపత్రిక): ఇజ్రాయిల్ చర్యపట్ల తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ క్షిపణి నిరోధక వ్యవస్థలను అందించడంలో విఫలమైందని అన్నారు. ఇజ్రాయిల్‌కు ఏమి జరిగిందో తనకు తెలియదని, తాను నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నానని, వైమానిక రక్షణ వ్యవస్థను ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదని, తాను షాక్‌లో ఉన్నానని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఫ్రెంచ్ విలేకరులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రికార్డింగ్‌ను శనివారం ఆయన కార్యాలయం విడుదల చేసింది. యుద్ధ ప్రారంభ కాలంలోనే ఐరన్‌డోమ్ వ్యవస్థ గురించి ప్రస్తావించాడు జెలెన్ స్కీ. ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్ గాజాలో పాలస్తీనియన్ మిలిటెంట్లు కాల్చే రాకెట్లను అడ్డుకునేందుకు ఉపయోగిస్తుంది. ఇజ్రాయెల్. తాము రష్యా దాడిని కచ్చితంగా ఖండిస్తున్నామంటూనే మాస్కోతో సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా అత్యంత జాగురతతో వ్యవహరిస్తోంది. వాస్తవానికి ఇజ్రాయెల్ దళాలు ఇరానియన్ అనుకూల మిలీషియాపై దాడి చేస్తూ ఉంటాయి. అలాగే ఇజ్రాయెల్ సిరియా విషయమై రష్యాతో కొంత విపత్కర పరిస్థితిని కూడా ఎదర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఉక్రెయిన్‌కి ఆయుధ సాయం అందించేందుకు ముందుకు రాలేకపోతోంది. దీంతో సిరియా, రష్యాలకు సంబంధించి ఇజ్రాయిల్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని తాను అర్థం చేసుకున్నానని జెలెన్ స్కీ అన్నారు. ఇజ్రాయిల్ ఉక్రెయిన్‌కు ఎలాంటి సైనిక సాయం అందించలేదని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఉక్రెయిన్‌కి ఆయుధాలను అందించేందుకు నిరాకరిస్తోంది. అయినా తాము ఆయుధ సాయం చేసే విషయంపై కట్టుబడిలేమని పేర్కొంది. ఉక్రెయిన్‌కి సాయం చేస్తామని మాత్రమే చెప్పామని సమర్థించుకుంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!