శాఖాపరమైన చర్యలకు కేంద్ర హోంశాఖ అనుమతి
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన కేంద్ర హోంశాఖ
అమరావతి,ఫిబ్రవరి 14 (ఆంధ్రపత్రిక): ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన చర్యలకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ అయ్యేవరకు ఆయనకు వచ్చే ఇంక్రిమెంట్లను రద్దు చేయాలని తెలిపింది. యూపీపీఎస్సీ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయన మీద కేసు నమోదు చేసింది. ఆయనను సస్పెండ్ చేసింది. తనపై విధించిన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 25న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా లేఖ రాశారు. 2021 జూలైలో తన మీద విధించిన సస్పెన్షన్‌ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. తన మీద విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు కూడా కాపీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా తన సస్పెన్షన్ ముగిసిందని ఆయన తేల్చి చెప్పారు. రెండేళ్లకు పైబడి ఐపీఎస్ అధికారులను సస్పెన్షన్‌లో పెట్టరాదన్న నిబంధనను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏబీవీ ఏపీ ప్రభుత్వంపై విజయం సాధించారు. ఏబీవీ సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ ఆయనను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనను ఏపీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇచ్చింది. అయితే పోస్టింగ్ ఇచ్చిన కొద్దిరోజులకే ఆయనపై మరోసారి సస్పెన్షన్ వేటు పడిరది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!