వేపాడ,నవంబర్,28( ఆంధ్ర పత్రిక):-
మండలంలోని శివాలయాలు కార్తీక మాస రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడాయి.అలాగే భక్తులు చెప్పే హర హర మహాదేవ్ శంభోశంకర నామస్మరణతో మార్మోగిపోయాయి.ముఖ్యంగా గుడివాడ, కరకవలస,ఆకుల సీతంపేట,చామలాపల్లి, గ్రామాల నడుమ కొండగుళ్ళు పై వెలసిన ఉమా బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం సోమవారం కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంతం పచ్చని తోటలు మధ్య ఉండడంతో వేలాదిగా భక్తుల తరలివచ్చి పరమశివుని దర్శించుకుని అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడంతో పాటు కార్తీక మాస వనభోజనాలు నిర్వహించుకొని ఆనందంగా గడిపారు.అలాగే బొద్దాం,సోంపురం,వల్లంపూడి, బానాది,నల్లబిల్లి,శివాలయాల్లో భక్తులు రాకతో కలకలలాడాయి.అలాగే వందలాదిగా వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు,రుద్రాభిషేకాలు, నిర్వహించుకున్నారు.