నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): ’ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్టేల్రోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత. ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఉత్తరాదిన కూడా పలు ప్రాజెక్ట్‌లను చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో సమంత టాప్`3లో ఉంది. ఇటీవలే ఈమె నటించిన యశోద రిలీజై భారీ వసూళ్లను సాధిస్తుంది. ఇక సమంత సినిమాల్లోకి రాకముందు చాలా కష్టాలు పడిరదట. 14 సంవత్సరాల వయసులోనే తను పనిచేయాల్సి వచ్చిందని సమంత తాజాగా ఓ ఇంటర్వూలో తెలిపింది. మ్యారేజ్ ఫంక్షన్లలో వెలకమ్ చేసే అమ్మాయిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 3గంటలు నిల్చొని గెస్ట్‌లకు వెల్కమ్ చెబితే రూ.800 నుండి రూ.1000 ఇచ్చేవారని చెప్పింది. పొద్దున చదువుకుని.. సాయంత్రం పనిచేసేదాన్ని అంటూ పాత రోజుల్ని గుర్తుచేసుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సమంత, ఏమాయ చేశావే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం సమంత ’శాకుంతలం’, ’ఖుషీ’ సినిమాలు చేస్తుంది. ఇటీవలే సమంత ’మయోసైటిస్’ అనే వ్యాధి బారిన పడినట్లు సోషల్ విూడియాలో వెల్లడిరచింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఇటీవలే యశోద ప్రమోషన్లో చెప్పుకొచ్చింది
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!